మా గురించి

ఋషివర్య (Rushivarya) అనేది మన తెలుగు పండుగలు, ఆచారాలు, సంప్రదాయాల వెనుక ఉన్న అర్థాన్ని సులభంగా వివరించే ప్రయత్నం. మా Instagram, YouTube రీల్స్‌లో ఒక్కో ఆచారాన్ని 30 సెకన్లలో చెబుతాం. ఇక్కడ అదే విషయాన్ని పూర్తిగా, వివరంగా చదవొచ్చు.

ఇక్కడ ఏముంటుంది

  • పండుగలు, మాసాలు: కార్తీక మాసం, ఏకాదశులు, పౌర్ణమిలు, వాటి నియమాలు.
  • ఇంటి ఆచారాలు: మామిడి తోరణం, గడపకు పసుపు, దీపారాధన వంటి రోజువారీ సంప్రదాయాలు.
  • కథలు: ప్రతి ఆచారం వెనుక పురాణాల్లో చెప్పిన కథ.

మేము ఎలా రాస్తాం

ప్రతి వ్యాసం నిత్య జీవితములో పండుగలు - పర్వదినాలు వంటి సంప్రదాయ గ్రంథాల ఆధారంగా రాస్తాం. పెద్దలు చెప్పిన విధానం, పురాణ కథ, నమ్మకం, ఈ మూడింటినీ వేరు వేరుగా స్పష్టంగా చెబుతాం. ప్రాంతాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి ఆచారాలు మారుతాయి. మీ ఇంటి పద్ధతి వేరుగా ఉంటే అదీ సరైనదే.

పొరపాటు కనిపిస్తే మాకు తెలియజేయండి, సరిచేస్తాం.